• myspiritualvoice2025@gmail.com

ஓசியா - 3

Old Testament

Header
shape
Old Testament
ஓசியா - 3

1. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించి నట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.

2. కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసి కొని దానినికొని ఆమెతో ఇట్లంటిని

3. చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును.

4. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలదినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పిం పకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.

5. తరు వాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచా రణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.